ఉరవకొండ, ఉరవకొండ రూరల్: ఉరవకొండ మండల పరిధిలోని బూదగవి గ్రామ సమీపంలోని అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారిలో కేసీఆర్టీసీ బస్సు, కారును వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరానికి చెందిన జాన్‌రెడ్డి, చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె సైనీ దీప్తి అల్లుడు రోహన్‌రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపీ క్షేత్రాన్ని సందర్శించి శనివారంనాడు ధర్మవరానికి తిరిగి వెళ్తున్నారు. బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు బూదగవి సమీపంలో ఓవర్‌టేక్ చేసే క్రమంలో కారును వెనుకభాగంలో ఢీకొట్టింది. దీంతో కారులో అదుపుతప్పి దూసుకెళ్లింది, కారు ధ్వంసం కాగా, అందులో ప్రయాణిస్తున్న జాన్‌రెడ్డి (80) అక్కడికక్కడే చనిపోయాడు, సైనీదీప్తి, రోహన్‌రెడ్డి, చెన్నమ్మతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి పంపించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీకొని కూలీలకు గాయాలు
పావగడ: పట్టణంలోని తేజస్ హోటల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రజవంతి గ్రామానికి చెందిన 14 మంది మహిళా కూలీలు గాయాలపాలై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాలూకాలోని నీలమ్మనహళ్లికి వేరుశనగ పంట కలుపును తీయడానికి ఆటోలో వెళ్లి తిరిగి స్వగ్రామం రజవంతికి ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. స్థానిక పీయూ కళాశాల లెక్చరర్ విశ్వనాథ్, రాజవంతికి చెందిన మంజునాథ్ తదితరులు బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
బూదగవి సమీపంలో ఘటన
కారులోని ఒకరు మృతి, నలుగురికి గాయాలు


