
రాయచూరు–సింధనూరు రైల్వే పనులు పూర్తి చేస్తాం
రాయచూరు రూరల్: 2027 నాటికి రాయచూరు– సింధనూరు రైల్వే పనులు పూర్తి చేస్తామని కేంద్ర ౖరైల్వే శాఖ మంత్రి సోమన్న వెల్లడించారు.
శనివారం రాత్రి బెంగళూరు రైల్వే స్టేషన్‌లో రిమోట్ కంట్రోల్ ద్వారా బెంగళూరు–కలబుర్గి వందే భారత్ రైలును యాదగిరిలో స్టాపింగ్‌కు పచ్చజెండాను చూపి ప్రారంభించారు. యాదగిరి రైల్వే స్టేషన్‌లో గురుమిఠకల్ ఎమ్మెల్యే శరణే గౌడ ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు ధనుంజయ, విజయ్‌కుమార్, అశోక్ కుమార్ మీనా, హేమ రాజ్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.