పర్యాటకుల స్వర్గధామం భీమనకొండ
బనశంకరి: ప్రకృతి సౌందర్యంతోపాటు ఆధ్యాత్మికతను, చారిత్రక ఆనవాళ్లను తనలో కలుపుకొని పర్యాటకులను కనువిందు చేస్తోంది పశ్చిమ కనుమల్లోని భీమనకొండ. ఇది ఉత్తరకన్నడ జిల్లా సిద్దాపుర పట్టణానికి సమీపంలో సముద్రమట్టానికి 1,621 మీటర్లు(5,318) అడుగుల ఎత్తులో ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ పర్యాటక స్థలంగా గుర్తించింది. పచ్చదనంతో కూడిన అడవులు, కనుందు చేసే జలపాతాలు, అపురూపమైన జాతి పక్షులు, వన్యజీవులతో కూడిన ఈ ప్రాంతం ప్రకృతిసౌందర్యానికి పెట్టిందిపేరు.భీమనకొండ దట్టమైన అటవీప్రాంతంతో కూడిన అడవులతో ఉండటంతో వన్యజీవులు సంరక్షణకు ప్రముఖ హాట్‌స్పాట్‌గా నిలిచింది.
భీమనకొండ చరిత్ర
భీమనకొండ పురాతన చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. పురాణాల ప్రకారం పాండవుల్లో ఒకరైన భీముడు వనవాస సమయంలో ఈ కొండపై విశ్రమించినట్లు బండలపై ఇప్పటికీ గుర్తులు కనిపిస్తాయి. చోళరాజు వంశీయులు తమ సామ్రాజ్య భద్రతకోసం భీమనకొండను సైనిక స్థావరంగా ఏర్పాటుచేసుకున్నారు. భీమనకొండ వద్ద ప్రాచీనకోటలు చారిత్రక నేపథ్యానికి నిదర్శనంగా నిలిచాయి. భీమనకొండ ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ భీమలింగేశ్వర ఆలయం కొలువై ఉంది. ఇక్కడి శివుడి ఆలయం నిత్యం భక్తులతో పూజలందుకుంటుంది. ఆలయం వాస్తుశైలి ద్రావిడ, చోళ శైలిలో ఉంది. ఇక్కడ చెక్కిన శిల్పాలు, అలంకరణతో కూడిన స్తంభాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారయి. బీమనగడ్డ జాత్ర అనే పిలిచే వార్షిక ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను కనువిందుచేస్తాయి. భీమన కొండ ట్రెక్కింగ్‌కు నిలయం
ఈకొండ సాహసప్రియులకు, ప్రకృతి ప్రియులకు స్వర్గధామంగా నిలిచింది, భీమనకొండ సాహసంతో కూడిన ట్రెక్కింగ్‌కు నెలవు. ట్రెక్కింగ్‌మార్గంలో దట్టమైన అడవులు, జలపాతాలు దర్శనం ఇస్తాయి. వైవిధ్యమైన పక్షులు, వన్యజీవుల మధ్య ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. భీమనగుడ్డ ప్రాముఖ్యతను, సాంస్కృతిక పరంపరను గుర్తించి ఈ ప్రాంతం సంరక్షణకు ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది.
పర్యాటకుల స్వర్గధామం భీమనకొండ
పర్యాటకుల స్వర్గధామం భీమనకొండ


