రన్‌వేపై విమానాన్ని ఢీకొన్న పక్షి

నిలిచిపోయిన విమానం   - Sakshi

యశవంతపుర: ప్రయాణికులందరూ దుబాయ్‌కి వెళ్లడానికి ఉత్సాహంగా సీట్లలో కూర్చుని ఉన్నారు. విమానం రన్‌వేపై వేగంగా ముందుకు సాగుతోంది. ఇంతలో ఏదో తగిలినట్లు పెద్ద శబ్ధం. అందరూ హడలిపోయారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని పక్షి ఢీకొనడంతో టేకాఫ్‌ వాయిదా పడింది. మంగళూరు విమానశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లడానికి గురువారం ఉదయం 8:30 కి విమానం సిద్ధంగా ఉంది. ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమై రన్‌ వే మీదకు వచ్చింది. ముందుకు వెళ్తుండగా ఒక పక్షి విమానం రెక్కను ఢీకొని మృత్యువాత పడింది.

పెద్ద చప్పుడు రావడంతో పైలట్‌ టేకాఫ్‌ను నిలిపివేశారు. ప్రయాణికులను కిందకు దించివేసి, విమానానికి ఏమైనా అయ్యిందా అని మెకానిక్‌లు పరిశీలించారు. చివరకు ఆ విమానాన్ని పక్కనపెట్టి బెంగళూరు నుంచి మరో విమానాన్ని రప్పించి అందులో ప్రయాణికులను దుబాయ్‌కి పంపించారు. ఈ సంఘటనతో మంగళూరు విమానశ్రయంలో కొన్ని గంటలపాటు ఆందోళన నెలకొంది.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top