
మాట్లాడుతున్న మల్లికార్జున ఖర్గే, పక్కన అభ్యర్థి భార్య
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం యాదగిరి జిల్లా గురుమఠకల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి, పార్టీ అభ్యర్థి బాబూరావ్ చించనసూరు తరఫున ప్రచారసభలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ఉన్నారని, నేతల మధ్య అసమ్మతిని తొలగించుకొని పార్టీకి పూర్వవైభవం తేవాలన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన కల్యాణ కర్ణాటకకు రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె)ను అమలు చేశామని గుర్తు చేశారు. కాగా రోడ్డు ప్రమాదం నుంచి ఇంకా కోలుకోని అభ్యర్థి బాబూరావ్ చించనసూరును స్ట్రెచర్ మీద కూర్చోబెట్టి ఆయన తరఫున భార్య వేదికపై చీర కొంగు పట్టి ఎన్నికల్లో తన భర్తకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు.