రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నగరంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కరపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలోని 1.18 కోట్ల కుటుంబాలు జీవితబీమా పథకంలో లబ్ధి పొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. – కరీంనగర్ కార్పొరేషన్


