హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి రోడ్డులో ఉన్న శ్రీలక్ష్మీగణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి డాక్టర్ విద్యా ప్రసన్న తీర్థస్వామి ఆధ్వర్యంలో మహాగణపతి హోమం, పంచసూక్త పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంటప పూజలు, అష్టదిక్పాలక హోమం, విశ్వంభర పూజ, స్వస్తివాచనం, కుంకుమార్చన, పుష్పాదివాసం క్రతువు శాస్త్రోక్తంగా గావించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. –హుజూరాబాద్


