కరీంనగర్ సిటీ: బయటి నుంచి వచ్చే తాత్కాలిక ప్రేరణ కన్నా అంతర్గతంగా కలిగే స్వీయ ప్రేరణే జీవితంలో మార్పునకు దోహదపడుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో ‘డిజైన్ యువర్ డెస్టినీ’ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచిస్తూ, విశాల దృక్పథం, సామాజిక స్పృహతో ముందుకు సాగాలని సూచించారు. చిన్న చిన్న నిర్ణయాలే భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాల సాధనకు డిగ్రీలతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు అవసరమని, ఏఐని సమర్థమైన భాగస్వామిగా ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆచార్య యు.ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలు, ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీశ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విశ్వవిద్యాలయం కల్పి స్తున్న నైపుణ్యాభివృద్ధి, మార్గదర్శకత్వ అవకా శాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, పలువురు అధ్యాపకులు, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజల తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ 32వ డివిజన్ హుస్సేనీపురలో కార్పొరేటర్ యూసుఫ్‌తో కలిసి రూ.6 లక్షల నిధులతో చేపట్టనున్న తాగునీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీన గ్రామాల డివిజన్ల ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. 32వ డివిజన్ హుస్సేనీపుర ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా నూతన పైపులైన్ పనుల ప్రారంభించామన్నారు. కార్పొరేటర్ మేకల వెంకటేశ్‌ష్, ముజీబ్, డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు11 కేవీ విద్యానగర్ ఫీడర్ పరిధిలో విద్యానగర్, రత్నం స్కూల్, కోరస్ స్కూల్, ఆర్టీసీ వర్క్‌షాప్ వెనుక ప్రాంతం, విజయదుర్గ కాలనీ, ఆదర్శ అపార్ట్‌మెంట్ ప్రాంతాలు, ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు 11 కేవీ గీతాభవన్ ఫీడర్ పరిధి లోని పారమిత స్కూల్, సత్య లాడ్జి, రాజీవ్ పార్క్, మంకమ్మతోట, ధన్గర్వాడి స్కూల్, రాంనగర్, పద్మనగర్, మార్క్‌ఫెడ్ ప్రాంతాలతో పాటు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కేవీ గంజ్ ఫీడర్‌లోని మార్కెట్ ఏరియా, సిక్కువాడ, బోయవాడ, అన్నపూర్ణ కాంప్లెక్స్, గంజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2, టౌన్ 1 ఏఈడీలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్ తెలిపారు.
స్వల్పంగా తగ్గిన పత్తి ధర
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం క్వింటాల్‌కు రూ.9,040 ఉండగా.. రూ.80 తగ్గి గురువారం గరిష్ట ధర రూ.8,860 పలికింది. మార్కెట్‌కు 109 వాహనాల్లో 914 క్వింటాళ్లను రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.8.800, కనిష్ట ధర రూ.8,650కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.


