కరీంనగర్ ఆర్టీసీ బస్స్టేషన్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట లో నిర్వహించిన సీఎం బహిరంగ సభకు బస్సులు కేటాయించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు రూట్లలో తక్కువ బస్సులతో ప్రయాణికులను చేరవేశారు. దీంతో చాలా మంది బస్సులు దొరక్క, వచ్చిన వాటిల్లో సీట్లు లేక ఇబ్బంది పడ్డారు. ఎలక్ట్రిక్ బస్సులు సరిపడా నడిపించినా.. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ రూట్లలో వెళ్లేవారు పడిగాపులు కాచారు. చేసేదేంలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


