● మంత్రి పొన్నం ప్రభాకర్
చిగురుమామిడి: ప్రజాపాలన ప్రభుత్వంలో ఏడు రకాల పెన్షన్లు మంజూరు చేస్తున్నామని, త్వరలోనే అర్హులైన వృద్ధులకు కూడా పెన్షన్లు అందిస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం చిగురుమామిడిలో కలెక్టర్ చిత్రామిశ్రాతో కలి సి 550 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సరైన ఆధారాలు లేక పెన్షన్లు తిరస్కరణకు గురైన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 19 నుంచి కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. అనంతరం చిగురుమామిడి ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదిని ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కళాశాలలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు.
ఆర్టీసీని విలీనం చేయాలి
కరీంనగర్ టౌన్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాబు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ మహాసభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో యూనియన్‌కు మద్దతుగా నిలిచిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కులకు భంగం కలి గించే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూని యన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సమ్మన్న మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటాల్‌కు రూ.8,890 కాగా మంగళవారం రూ.40 పెరిగి గరిష్ట ధర రూ.9,030 పలికింది. మార్కెట్‌కు 117 వాహనాల్లో 988 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.8,900, కనిష్ట ధర రూ.8,700కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న సదానందం, ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.


