21వ డివిజన్ పరిధిలోని విద్యానగర్, వెంకటేశ్వరకాలనీకి చెందిన నాంపల్లి వజ్రమ్మ (65) ఇటీవల వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగా.. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ఆమె అర్హురాలేనని, పింఛన్ వస్తుందని భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం వచ్చిన లబ్ధిదారుల జాబితాలో వజ్రమ్మ పేరు కనిపించలేదు. పేదరికం, భర్త లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆసరాగా ఉంటుందనుకున్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
19వ డివిజన్ పరిధిలోని సాలెహ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ వాహెద్ మానసిక దివ్యాంగుడు. ఇతనికి 90శాతం వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సర్టిఫికెట్ జారీచేశారు. ఇటీవల దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశాడు. అధికారులు వెరిఫికేషన్ పూర్తి చేయగా జాబితాలో వాహెద్ పేరు రాలేదు. 90శాతం వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగుడికి కూడా పింఛన్ రాకపోవడంపై ఆయన కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.


