ఉద్యమ చరిత్ర పునఃస్మరణ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమ చరిత్ర పునఃస్మరణ

Nov 18 2026 12:20 AM | Updated on Nov 18 2026 12:20 AM

● 29న దీక్షా దివస్‌కు భారీ ఏర్పాట్లు ● మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

కరీంనగర్‌ కల్చరల్‌: రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్‌ 29వ తేదీ చెరగని ముద్ర వేసిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు చేపట్టిన పోరాట స్ఫూర్తిని చాటేలా ఈ నెల 29న అలు గునూరులో దీక్షా దివస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. చింతకుంటలో ఉన్న బీ ఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం దీక్షా దివస్‌ పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, సంజయ్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, ఒడితెల సతీశ్‌, రవిశంకర్‌, దాసరి మ నోహర్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తుల ఉమ, దావ వసంత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారా వు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ పాల్గొన్నారు.

దీక్షా దివస్‌కు ఇన్‌చార్జిలు వీరే

కరీంనగర్‌ టౌన్‌: దీక్షా దివస్‌ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్‌చార్జి లను నియమించింది. మానకొండూరు ఇన్‌చార్జిగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, చొప్పదండికి జీవన్‌రెడ్డి, వేములవాడకు కోరుకంటి చందర్‌, సిరిసిల్లకు ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌, హుస్నాబాద్‌కు పుట్ట మధు, కరీంనగర్‌కు బోయినపల్లి వినోద్‌కుమార్‌, హుజూరాబాద్‌కు నారదాసు లక్ష్మణరావును నియమించింది. ఇన్‌చార్జులు నియోజకవర్గాల్లో జనసమీకరణతో పాటు కార్యక్రమం విజయవంతానికి కృషి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement