ఓపీఎస్‌ కోసం సత్యాగ్రహం | - | Sakshi
Sakshi News home page

ఓపీఎస్‌ కోసం సత్యాగ్రహం

Nov 18 2026 12:20 AM | Updated on Nov 18 2026 12:20 AM

కరీంనగర్‌: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాకేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం సామూహిక సెలవు పాటించి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎంఓపీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి గంగాపురం స్థితప్రజ్ఞ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే ఆర్థిక భద్రత సమస్యలను వివరించారు. పెన్షన్‌ కానుక కాదని, ఉద్యోగుల హక్కు, సామాజిక భద్రత అని స్పష్టం చేశారు. ఓపీఎస్‌ సాధించే వరకు ఐక్యంగా, శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement