కరీంనగర్: ‘సారూ.. 33 ఏళ్ల క్రితం నక్సల్స్ కాల్పుల్లో శరీరంలో దిగిన తూటా ఇంకా సలుపుతోంది. ఒంటికి తగిలిన గాయాలతో ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నా. బతుకుభారంగా మారింది. నా కూతురుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా చూడండి. నాకు జీవి తాంతం మందుల ఖర్చు భరించేలా సాయం చేయండి’ అంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను వేడుకున్నాడు. బుధవారం ఉదయం భార్యతో కలిసి ఆటోలో కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయానికి వచ్చా డు. ఆటో నుంచి దిగలేని పరిస్థితిని గమనించిన సంజయ్ స్వయంగా బయటకు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి వినతిపత్రం అందజేస్తూ సర్పంచ్‌గా ఉన్న సమయంలో పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాననే నెపంతో నక్సల్స్ తనపై కాల్పులు జరిపారని, ఈ ఘటనలో నడుం విరిగి, మంచానికే పరిమితమయ్యానని కన్నీ రు పెట్టుకున్నాడు. జీవితాంతం మందులు వాడాలని వైద్యులు సూచించారని, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదన్నాడు. ఎంఎస్సీ, బీఈడీ చదివిన తన కుమార్తెకు ప్రభు త్వ ఉద్యోగం కల్పించాలని, తనకు జీవితాంతం మందులు అందేలా చూడాలని కోరాడు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


