అడ్వెంచర్‌ క్యాంపునకు ఎస్‌ఆర్‌ఆర్‌ అధ్యాపకుడు | - | Sakshi
Sakshi News home page

అడ్వెంచర్‌ క్యాంపునకు ఎస్‌ఆర్‌ఆర్‌ అధ్యాపకుడు

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

కరీంనగర్‌సిటీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నవంబర్‌ 17 నుంచి 27 వరకు నిర్వహించనున్న దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అడ్వెంచర్‌ క్యాంపునకు శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ కాంపెల్లి అర్జున్‌ ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఈ అడ్వెంచర్‌ క్యాంపునకు విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడంపై కళాశాల అధ్యాపకులు అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున కళాశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గర్వకారణమని పేర్కొన్నారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్స్‌ నితిన్‌ పాఠక్‌, రాజయ్య, కళాశాల స్టాఫ్‌ క్లబ్‌ సెక్రట రీ మల్లారం శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement