మౌలానా సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

మౌలానా సేవలు చిరస్మరణీయం

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌టౌన్‌: దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా జయంతి పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజేశ్వరి, డీఆర్‌వో స్వామి, మైనారిటీ సంక్షేమ అధికారి జలాలుద్దీన్‌ అక్బర్‌, డీఈవో తిరుపతిరావు, వివిధ శాఖల అధికారులు, మైనారిటీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు అబుల్‌ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. దేశంలో విద్యావ్యాప్తికి బలమైన పునాదులు వేసిన మహనీయుడని అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించగా.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్‌ బహుమతులు అందించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ ప్రకాశ్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు కాళీచరణ్‌, మాధవి, యమున, తాజుద్దీన్‌, కార్పొరేటర్లు మహ్మద్‌ యూసుఫ్‌, హుంస, మైనార్టీ నాయకులు ఎంఏ సిరాజ్‌, సిరాజ్‌ హు స్సేన్‌, ఎస్‌ఏ మొహాసేన్‌, అబ్బాస్‌ సమీ, మహమ్మ ద్‌ జమీల్‌, ముఖద్‌ రియాజ్‌ అలీ, రజజ్వి, షోబు, రహమాన్‌, నవాజ్‌, బర్కత్‌ అలీ పాల్గొన్నారు.

70 గ్రామాల్లో దశలవారీగా రీసర్వే

కరీంనగర్‌అర్బన్‌: భూముల రీసర్వే అంటే కేవలం భూముల కొలతలు, హద్దుల నిర్ధారణకే పరిమితం కాకుండా.. ప్రతీ పట్టాదారుడి సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. రీసర్వే అనంతరం అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు నేరుగా గ్రామాల్లో పర్యటించి భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, హద్దుల వివాదాలు, ఇతర రెవెన్యూ సమస్యలపై విచారణ జరిపి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 70 రెవెన్యూ గ్రామాల్లో దశలవారీగా రీసర్వే చేపడుతున్నట్లు. వివరించారు. బుధవారం రాత్రి అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కిషన్‌రావుతోపాటు పలువురు సంబంధిత అధికారులతో కలెక్టర్‌ రీసర్వే ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

లబ్ధిదారుల గుర్తింపు పూర్తి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. హుజూరాబాద్‌, మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతోపాటు వారికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ తయారీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement