ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

సాక్షి కథనానికి స్పందించిన అధికారులు కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో పదోన్నతులు 63 మంది సిబ్బందికి లబ్ధి.. అందులో 9 మంది మహిళలు

కరీంనగర్‌ టౌన్‌: అర్హత ఉన్నా అందని పదోన్నతి శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ అధికారులు స్పందించారు. మంగళవారం రీజియన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌లకు అసిస్టెంట్‌ డిపో క్లర్క్‌(ఏడీసీ)గా పదోన్నతులు కల్పించారు. మొత్తం 63 మందికి పదోన్నతి అవకాశం కల్పించగా.. ఇందులో 9 మంది మహిళా ఉద్యోగులున్నారు. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని 11 డిపోల్లో 1,340 మంది డ్రైవర్లు, 955 మంది కండక్టర్లు, 543 మంది ఇతర సిబ్బంది ఉండగా.. ఇందులో సగం మంది వరకు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరి సర్వీ సు పెరుగుతున్నా.. అర్హతలున్నా.. యాజమాన్యం కండక్టర్‌ కేడర్‌లో అవసరానికి మించి సిబ్బంది ఉన్నారంటూ పదోన్నతుల ప్రక్రియను అట్టకెక్కించారు. అదనపు సిబ్బంది అని అధికారులు అంటున్నా.. క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులకు పొంతన లేకుండా ఉంది. పలు డిపోల్లో కండక్టర్ల కొరత తీవ్రంగా ఉండగా.. ఉన్న సిబ్బందిపైనే అదనం భారం పడుతోంది. ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్న యాజమాన్యం.. ఏళ్లుగా పని చేస్తున్న రెగ్యులర్‌ కార్మికులకు మాత్రం పదోన్నతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించి మంగళవారం సీనియారిటీ ప్రకారం పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement