కరీంనగర్‌స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ మహిళా ఎమర్జింగ్ స్టార్స్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ బుధవారం అల్గునూర్‌లోని వీజేఆర్ క్రికెట్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు, 20 మంది ఫిజియోలు, ట్రైనర్లు తదితరులు కలిపి మొత్తం 250 మంది హాజరయ్యారు. పోటీలను ఉదయం కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, మనోహర్‌రావు, ఉపాధ్యక్షులు మహేందర్‌గౌడ్, మురళీధర్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. యువ మహిళా క్రికెటర్లకు ఈ టోర్నమెంట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. తొలిసారిగా కరీంనగర్ వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతున్నట్లు తెలిపారు. కేడీసీఏ సంయుక్త కార్యదర్శి కరుణాకర్‌రావు, కోశాధికారి బండి శ్రవణ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వంశీకృష్ణగౌడ్, విద్యాసాగర్‌రావు, అజయ్, తెలంగాణ ఉమెన్ క్రికెట్ ఇన్‌చార్జి సునీత ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు ఫలితాలు
రోజెస్ ఏ, మేరిగోల్డ్ ఏ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రోజెస్ ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 98 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మేరిగోల్డ్ ఏ జట్టు 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి విజయం సాధించింది. టి.సంజన(మేరిగోల్డ్ ఏ) ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. హైబిస్కస్ బీ, లోటస్ జీ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైబిస్కస్ బీ జట్టు 18.5 ఓవర్లలో 59 పరుగులకు ఆలౌట్ కాగా.. లోటస్ జీ జట్టు 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. 3 వికెట్లు తీసిన జి.అక్షర ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికై ంది.


