జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.8,750 పలికింది. బుధవారం మార్కెట్‌కు 98 వాహనాల్లో 975 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్‌కు మోడల్ ధర రూ.8,600, కనిష్ట ధర రూ.8,300కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల అబ్జర్వర్‌గా శ్రీనివాస్
కరీంనగర్‌స్పోర్ట్స్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 13 నుంచి 15 వరకు జరగనున్న 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లాలోని కోరపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు జిట్టబోయిన శ్రీనివాస్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య బాధ్యులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోటీలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించడంతోపాటు క్రీడాకారులకు న్యాయబద్ధమైన పోటీ వాతావరణం కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సిలాల్, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్, కోశాధికారి కలిగేటి శ్రీనివాస్, పెటా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడేపు శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, సీనియర్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.
మల్టీపర్పస్ వర్కర్ పోస్టులకు రేపు మౌఖిక పరీక్ష
కరీంనగర్: జాతీయ ఆయుష్ మిషన్‌లో భాగంగా జిల్లాలో ఆయుష్ పబ్లిక్ హెల్త్ కార్యక్రమాల నిర్వహణ కోసం మల్టీపర్పస్ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 13న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి వెల్లడించారు. ఆయుష్ శాఖ, తెలంగాణ సికింద్రాబాద్ వారి పరిపాలనా నియంత్రణలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు 2027 మార్చి 31 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మల్టీపర్పస్ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జరిగే మౌఖిక పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
కొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా గురువారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కోర్టు, కేడీఆర్ పార్కు, ఎక్స్‌ఫ్లోరికా స్కూల్, కెమిస్ట్ భవన్, శివ థియేటర్, వేంకటేశ్వర ఆలయం ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరుమల టాకీస్, వందన అపార్ట్‌మెంట్, మడలేశ్వరస్వామి ఆలయం, వసుధ హోటల్ లైన్ ప్రాంతాలు, ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కోర్టు చౌరస్తా, వన్ హాస్పిటల్ పాత డీఐజీ బంగ్లా, ఐబీ చౌరస్తా, సర్కస్ మైదానం, పద్మనాయక కల్యాణ మంటపం, జ్యోతినగర్, గీతాభవన్ వెనక ప్రాంతం, కార్పెంటర్ సొసైటీ ప్రాంతాలు, ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు పారమిత స్కూల్, సత్య లాడ్జ్, రాజీవ్ పార్కు, మంకమ్మతోట, ధన్గరివాడి స్కూల్, రాంనగర్, పద్మనగర్, మార్క్‌ఫెడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు టౌన్–1, 2, ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
కొత్తపల్లి, రూరల్ మండలాల్లో..
విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు చింతకుంట, బద్దిపల్లి, నాగులమల్యాల, కమాన్‌పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మొగ్ధుంపూర్, మందులపల్లి, చేగుర్తి, ఇరుకుల్ల, చెర్లభూత్కూర్, చామన్‌పల్లి, దుబ్బపల్లి, తాహెర్‌కొండాపూర్, జూబ్లీనగర్, బహద్దూర్‌ఖాన్‌పేట్, ఫకీర్‌పేట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.


