పిల్లలు, గుండెజబ్బున్నవారు జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

పిల్లలు, గుండెజబ్బున్నవారు జాగ్రత్త

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

దీపావళి పండుగలో ఎంత సరదా ఉందో ప్రమాదం అంతే ఉంది. గుండె జబ్బు ఉన్నవారు భారీ శబ్దాలకు దూరంగా ఉండాలి. హైడ్రోజన్‌ బాంబులతో అత్యంత భారీ శబ్ధం వస్తుంది. గుండెవీక్‌గా ఉన్నా వారు, గుండెకు సంబంధించిన వ్యాధులున్న వారు, హార్ట్‌ అటాక్‌ వచ్చి కోలుకున్న వారు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శబ్దాల వలన గుండె ఎక్కువగా కొట్టుకోవడం. బీపీ పెరగడం, గుండెల్లో దడవంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

– పి.ప్రియాంక, పిల్లల వైద్య నిపుణురాలు

కాలిన గాయాలపై నీరు పోయాలి

టపాసులు కాల్చే సమయంలో గాయమైతే గాయాలపై నీరు పోయాలి. వీలైతే సబ్బుతో కడగాలి. ఎందుకంటే టపాసుల్లో ఉంటే పొటాషియం, సురేకారం ఇతర రసాయనాలు రక్తంలో కలిసి మరింత ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాలిన గాయాలను శుభ్రంగా కడిగి యాంటి సెప్టిక్‌ క్రిమ్‌ పూయాలి. 24 గంటల్లోగా డాక్టర్‌ను సంప్రదించాలి. లేకుంటే ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంటుంది. శరీరంలోని సున్నిత భాగాలకు గాయాలైతే వీలైనంత తొందరగా దగ్గరల్లో ఉన్న డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి.

– వి.సుమన్‌చందర్‌ రావు, చర్మ వ్యాధుల నిపుణుడు

ప్రాథమిక చికిత్స చేయవద్దు

మనిషి వినికిడి శక్తి 20 నుంచి 60 డెసిబల్స్‌ మాత్రమే. అంతకన్నా ఎక్కువగా అంటే 80 డెసిబుల్స్‌ ఉంటే చెవినొప్పి వస్తుంది. ప్రస్తుతం లభిస్తున్న బాంబులు 100 నుంచి 180 డిసిబల్స్‌ శబ్ధం చేసేవి. 120 డిసిబల్స్‌ శబ్దం వలన వినికిడి శక్తి కోల్పోవడం జరుగుతుంది. చెవికి దగ్గరగా అంత శబ్దం వస్తే కర్ణభేరి పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఒక వేళ చెవి నొప్పి వచ్చిన, చెవిలో నుంచి రక్తం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

– సీహెచ్‌ రమణాచారి,

ఈఎన్‌టీ నిపుణుడు, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement