మోడలింగ్‌లో మెరిసిన సుల్తానాబాద్‌ యువతి | - | Sakshi
Sakshi News home page

మోడలింగ్‌లో మెరిసిన సుల్తానాబాద్‌ యువతి

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన యువతి లకిశ్రీ కట్టల మోడలింగ్‌ రంగంలో సత్తా చాటారు. వరంగల్‌లో తెలంగాణ స్పార్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ స్పార్క్‌ సీజన్‌–1’ గ్రాండ్‌ ఫెస్టివల్‌లో ప్రతిభ కనబరిచి రెండు అవార్డులను కై వసం చేసుకున్నారు. మిస్‌ తెలంగాణ సెకండ్‌ రన్నరప్‌గా నిలవడంతో పాటు మిస్‌ పెద్దపల్లి టైటిల్‌ను సొంతం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టిన లకిశ్రీ గతంలోనూ పలు పోటీల్లో పాల్గొని అనేక కిరీటాలు సాధించారు. తాజా విజయంతో తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌ నిర్వాహకులు గౌస్‌ పాషా ఆమెను అభినందించారు. లకిశ్రీ విజయంపై తల్లిదండ్రులు కట్టల శ్రీనివాస్‌, పావని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బి.ఫార్మసీ ఫైనలియర్‌ చదువుతున్న లకిశ్రీ భవిష్యత్తులో మిస్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడమే తన లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement