రోడ్డు ప్రమాద బాధితులు, మెదడులో రక్తస్రావం, పక్షవాతం లక్షణాలతో వచ్చే వారికి వెంటనే ఇమేజింగ్ పరీక్షలు అవసరం. సీటీ స్కాన్‌తో రక్తస్రావం, గాయాల తీవ్రతను గుర్తించవచ్చు. ఎంఆర్‌ఐతో మెదడు, నరాలు, కండరాలు, వెన్నెముక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించవ చ్చు. అల్ట్రాసౌండ్‌తో గర్భస్థ శిశువు ఎదుగుదల, కాలేయం, మూత్రపిండాలు తదితర అవయవాల పరిస్థితిని తెలుసుకోవచ్చు. డాప్లర్ పరీక్ష రక్తప్రసరణలోని అ డ్డంకులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్సలో కణితుల పరిమా ణం, వ్యాప్తిని అంచనా వేయడంలోనూ రేడియాలజీయే కీలకం. – కె.హారిక, రేడియాలజిస్టు


