ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 25వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు కారం పొడితో భోజనం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండగా.. మరోవైపు 25 రోజులుగా వేతనాలందక కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాలకు సరుకులు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొందని వాపోయారు. సమస్యలు పరిష్కరించే దాకా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. – కరీంనగర్


