రాజీవ్
రహదారిపై
తిమ్మాపూర్: మండలంలో కోతుల సంఖ్య పెరుగుతోంది. వానరాలు గ్యాంగులుగా యుద్ధాలకు దిగుతున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు, ఒంటరిగా వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాయి. ఆధిపత్య పోరుతో హడలెత్తిస్తున్నాయి. మరోవైపు అలుగునూర్ నుంచి రేణిగుంట వరకు రాజీవ్ రహదారిపై ప్రతీరోజు కోతులు వాహనాల కిందపడి చనిపోతున్నాయి. జిల్లా నుంచి మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పట్టుకున్న కోతులను తిమ్మాపూర్ శివారు ప్రాంతాల్లో వదులుతున్నారు. కొత్తగా వచ్చిన కోతులు, ఇప్పటికే ఉన్నవాటి మధ్య ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఆహారం దొరకక రాజీవ్‌రహదారి వైపు పరుగెడుతున్నాయి. ఆహారం లేక రాత్రి సమయాల్లో రహదారి పక్కన తిరుగుతూ రోడ్డుపైపడే గింజలు తింటున్నాయి. ఈ క్రమంలో వేగంగా వచ్చే వాహనాల కింద పడి మరణిస్తున్నాయి.
హృదయం చలించింది...
ఉదయం పిల్లల్ని స్కూలు తీసుకెళ్లేందుకు బండిపై వెళ్తుండగా కాకతీయ కాల్వ సమీ పంలో నాలుగు కోతులు నుజ్జునుజై మరణించి కనిపించాయి. గతంలో వానరాలు చనిపోతే వాటికి దహన సంస్కరణ చేసి విగ్రహం ఏర్పాటు చేసేవారు. కానీ.. ప్రస్తు త పరిస్థితుల్లో కోతులు విచ్చలవిడిగా రావడంతో రోడ్లపై దయనీయ స్థితిలో మరణించి కనిపిస్తే హృదయం కలిచి వేస్తుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకో వాలి.
– కూన సర్వేశ్, చేపల కాలనీ, అల్గునూరు


