పరామర్శ | - | Sakshi
Sakshi News home page

పరామర్శ

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

శంకరపట్నం: ఇటీవల మరణించిన గద్దపాక గ్రామపంచాయతీ 7వ వార్డు సభ్యుడు వేణు కుటుంబసభ్యులను గురువారం వార్డు సభ్యుల ఫోరం సభ్యులు పరామర్శించారు. వేణు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్‌ పర్శరాములు, వార్డు సభ్యుల ఫోరం వ్యవస్థాపకురాలు జ్యోతి, మండల ఇన్‌చార్జి రమణారెడ్డి, భరత్‌, అసీఫ్‌, రమేశ్‌, మోహీన్‌, జైపాల్‌, వెంకటేశ్‌, రాజు, శంకర్‌రెడ్డి, శ్రీకాంత్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

దొంగల అప్పగింత

శంకరపట్నం: మండలంలోని గొల్లపల్లిలో పైపులు, విద్యుత్‌ వైర్లు, కేబుల్‌ దొంగతనానికి పాల్పడుతున్న ఆరుగురు మహిళలను గురువారం గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

అన్నదాతలు

అప్రమత్తంగా ఉండాలి

హుజూరాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ ‘రైతు భరోసా’ నిధుల పేరుతో వచ్చే సైబర్‌ మోసపూరిత సందేశాల పట్ల అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) సునీత సూచించారు. నిధులు జమ కావాలంటే లింకులపై క్లిక్‌ చేయాలంటూ సైబర్‌ నేరగాళ్లు పంపే మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. రైతులు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్‌ సమాచారాన్ని ఎవరికీ చెప్పొద్దని కోరారు.

నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక

హుజూరాబాద్‌ రూరల్‌: మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తూర్పాటి సునీత ప్రకటనలో తెలిపారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటీవల చేపట్టిన సామాజిక తనిఖీలపై ప్రజావేదిక జరుగుతుందని, సంబంధిత శాఖల అధికా రులు, సిబ్బంది హాజరుకావాలని కోరారు.

అమరవీరులకు నివాళి

హుజూరాబాద్‌: విప్లవ విద్యార్థి ఉద్యమ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్‌ అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కాకతీయ జూనియర్‌ కళాశాలలో కామ్రేడ్‌ జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి కొనేటి ప్రశాంత్‌, నాయకులు రాహుల్‌, దిలీప్‌, సందీప్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

05 హెచ్‌ జెడ్‌ బి 01:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement