చొప్పదండి: పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. పేరెంట్స్ కమిటీ ఇచ్చిన వినతిపత్రంపై ఆయన స్పందించారు. విద్యాలయంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, శీతాకాలంలో వేడి నీటి స్నానం చేసేందుకు గ్లీజర్లు ఏర్పాటు చేయాలని సభ్యులు విన్నవించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ స్వాతి, వైస్ ప్రిన్సిపాల్ దీప్తి, కమిటీ చైర్మన్ సంబోజి సునీల్, భూమయ్య, సురేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వేతనమివ్వడం లేదని
ఆత్మహత్యాయత్నం
చొప్పదండి: తనకు 3 నెలలుగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని, కారోబార్ పోస్టు నుంచి తొలగించే కుట్రలు చేస్తున్నారని దేశాయిపేటకు చెందిన నరేందర్‌రెడ్డి గురువారం గ్రామ పంచాయతీ ఎదుట పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. తనపై అధికారి ఉద్దేశపూర్వకంగా కారోబార్ పోస్టు నుంచి బయటకు పంపించే కుట్రలు చేస్తున్నాడని, పాలకవర్గానికి సంబంధం లేకుండా జరుగుతోందని ఆరోపిస్తూ నరేందర్‌రెడ్డి పురుగు మందు తాగుతానని పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. గ్రామస్తులు పురుగుల మందు డబ్బాను తీసుకొని పడేశారు. పాలకవర్గంతో మాట్లాడుతామని హామీ ఇచ్చి నిరసనను విరమింపజేశారు.
మధుమేహంపై జాగ్రత్త
చర్యలు అవసరం
చొప్పదండి: ప్రజలు మధుమేహంపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అత్యవసరమని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ మోర భద్రేశం అన్నారు. భూపాలపట్నం గ్రామంలో గురువారం ఉచితంగా డయాబెటిక్ వైద్యశిబిరం నిర్వహించా రు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. క్లబ్ అధ్యక్షుడు వల్లాల జగన్, కార్యదర్శి దూస రాము, వల్లాల కృష్ణహరి, రాజేశ్ పవార్, ఛత్రపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నా రు.
ఖేత్ బచావో అభియాన్
గంగాధర: ఉప్పరమల్యాల గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రభాకర్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రతీ రైతు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏడీఏ ప్రియదర్శిని, సర్పంచ్ ముద్దం నగేశ్, ఏవో శ్రీనివాస్, ఏఈవో వెంకట్, రైతులు పాల్గొన్నారు.


