వీణవంక: కోర్కల్, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల పునర్నిర్మాణాన్ని ఐదేళ్లుగా పట్టించుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో చెక్‌డ్యామ్‌లను పరిశీలించారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు చెక్‌డ్యామ్‌లను విస్మరించాయని, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సొంత మండలంలో సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం విచారకరమన్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గణపతి, ర ఘు, సంపత్‌రావు, రాజేందర్, వినోద్‌కుమార్, రమణారెడ్డి, రాజు, కొండల్‌రెడ్డి, ఆదిరెడ్డి,పెద్దిమాల్లారె డ్డి, శ్రీనివాస్, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


