మానకొండూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవల్లి రాజలింగం సూచించారు. మండలంలోని ఈదులగట్టేపల్లి గ్రామంలో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీస సత్యనారాయణ, హాకా జిల్లా అధికారి కృష్ణయ్య, మానకొండూర్ సొసైటీ అధ్యక్షులు నాగిశెట్టి రాజయ్య, నాయకులు రామినేని రమణ, దూలం వీరస్వామి గౌడ్, కనకం అశోక్, రా మాంజనేయులు, ముక్కెర సతీశ్, చిరంజీవి, బండి సమ్మయ్య, బందెల మహేందర్, మట్టెపల్లి ఆంజనేయులు, బెడద ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


