సమాజ మార్పునకు న్యాయ విజ్ఞానం సాధనం కావాలి | - | Sakshi
Sakshi News home page

సమాజ మార్పునకు న్యాయ విజ్ఞానం సాధనం కావాలి

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

రామడుగు: సమాజ మార్పునకు న్యాయ విజ్ఞానం సాధనంగా కావాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్‌సింగ్‌ అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా గురువారం రామడుగు మండలం వెదిర కిమ్స్‌ లా కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో మాట్లాడారు. న్యాయ విజ్ఞానాన్ని ప్రజల హక్కుల పరిరక్షణకు, సమాజంలో సమానత్వం, న్యాయ స్థాపనకు వినియోగించాలని అన్నారు. కిమ్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ పేర్యాల సాకేత్‌రామారావు, లా కళాశాల ప్రిన్సిపాల్‌ పి.నవీన్‌కుమార్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు కిరణ్‌కుమార్‌, చంద్రప్రకాశ్‌రెడ్డి, అధ్యాపకులు కొమురయ్య, వెంకటస్వామి, కిషన్‌, వంశీకృష్ణ, కీర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement