హుజూరాబాద్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు వేముగంటి శ్యాంప్రసాదరావు(86) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పర్వేద గ్రామానికి చెందిన శ్యాంప్రసాదరావు.. చిన్నతనం నుంచే భారత స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. జీవితాంతం క్రమశిక్షణ, సామాజిక విలువలకు కట్టుబడి ప్రజాసేవలో గడిపారు. ఆయనకు కుమారుడు మధుకర్‌రావు, కుమార్తె రమణి ఉన్నారు. మనుమడు ఎల్‌వీ అర్జున్ తెలంగాణ రాష్ట్ర యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్యాంప్రసాదరావు మృతికి రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు సంతాపం తెలిపారు.


