పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్డుకు చెందిన ఆసిఫాఅంజుమ్(24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆరేళ్ల క్రితం అంజుమ్‌కు ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన అఫ్రోజ్‌తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త అఫ్రోజ్‌తో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఆమె కొద్దిరోజుల క్రితం పిల్లలను భర్తవద్దే వదలి పుట్టింటికి వచ్చింది. భర్త వద్దకు వెళ్లాలని పెద్దలు సూచించినా.. వినిపించుకోలేదు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


