జగిత్యాల క్రైం: జగిత్యాల శివారు గాంధీనగర్‌లో తాళంవేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. గాంధీనగర్‌కు చెందిన గెల్లె రాధ తన భర్త రెండునెలల క్రితం మరణించడంతో ఇటీవల తన బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకోగా.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. ఐదు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి నగలు, రూ.40వేలు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
28న నవోదయ ప్రవేశ పరీక్ష
చొప్పదండి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28న జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో పరీక్ష కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దరఖాస్తు చేసిన 3,888 మంది విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 20వ తేదీలోగా చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఎస్సై, కానిస్టేబుల్‌పై ఫిర్యాదు
కరీంనగర్‌క్రైౖం: రోడ్డు ప్రమాదం కేసులో ఇరికిస్తామంటూ బెదిరించి రూ.30వేలు వసూలు చేశారని ఆరోపిస్తూ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన చల్లా రాజ్‌కుమార్ శంకరపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీధర్‌రెడ్డిలపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. జూన్ 16న పోలీసులు తన ట్రాక్టర్‌ను బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రమాదం కేసులో ఇరికిస్తామని బెదిరించి తన తండ్రి వద్ద రూ.30వేలు తీసుకున్నారన్నారు. ట్రాక్టర్, సెల్‌ఫోన్‌ను తిరిగి అప్పగించారని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు. శంకరపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డిని సంప్రదించగా.. ఫిర్యాదులో ఉన్న అంశాలు మొత్తం అవాస్తవమని వివరించారు.
గంజాయి పట్టివేత
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులోని ఇటుకబట్టీల్లో పనిచేసే కూలీలకు విక్రయించేందుకు వచ్చిన వ్యక్తి నుంచి కిలో 160 గ్రాముల గంజాయి (రూ.58 వేల విలువ)ని బుధవారం స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ ఎస్సై మధూకర్ తెలిపారు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన లోకేశ్ (ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం) నాగపూర్ నుంచి గంజాయి తీసు కొచ్చి ఇటుకబట్టీల్లో పనిచేసే ఒడిశా కూలీలకు విక్రయించేందుకు తిరుగుతున్నాడు. అను మానాస్పదంగా తిరుగుతున్న ఆయనను అదుపులోకి తీసుకొని బ్యాగు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై వివరించారు.


