కొడిమ్యాల: వడ్లు ఆరబెట్టేందుకు వెళ్తున్న మహిళ మెడలోంచి పుస్తెలతాడు లాక్కెళ్లిన ముగ్గురు దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మల్యాల సీఐ రాజ్‌కుమార్, కొడిమ్యాల ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. గంగారంతండాకు చెందిన అజ్మీర దూరి (50) మంగళవారం ఉదయం సూరంపేట ఐకేపీ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బుధవారం నాచుపల్లి ఇటుకబట్టీల శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న కోరుట్లకు చెందిన గణేశ్, మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. దొంగతనానికి వాడిన బైక్‌ను జగిత్యాలరూరల్ మండలం తిప్పన్నపేటలో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రెండున్నర తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


