కరీంనగర్‌టౌన్: వార్డు సభ్యులు సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది అతికం రాజశేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కామెర తిరుమల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షకు పైగా వార్డు సభ్యులు ఉన్నారని, వారికి గౌరవ వేతనంగా రూ.5వేలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అకాల మరణం చెందితే రూ.20లక్షలు ప్రకటించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలపై పేర్లు రాయించాలన్నారు. ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ ఆధ్వర్యంలో డిసెంబర్ 29న కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుముల నవీన్ కుమార్, అధికార ప్రతినిధి నాగుల సాంబయ్య, బొబ్బటి శ్రీకాంత్, పబ్బ మహేశ్ గౌడ్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీదేవి, అమ్మిగల్ల గోపాల్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్


