అనాథగా వచ్చి.. ఆదర్శంగా వెళ్లి..! | - | Sakshi
Sakshi News home page

అనాథగా వచ్చి.. ఆదర్శంగా వెళ్లి..!

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

కోల్‌సిటీ/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీప వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో రెండేళ్లుగా ఆశ్రయం పొందుతున్న అడిచర్ల భూదేవి (75) మంగళవారం రాత్రి జీజీహెచ్‌లో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు లేని ఆమె నేత్రదానంతో ఇద్దరికి చూపునివ్వనుండగా, పార్థివదేహం వైద్య విద్యార్థుల అధ్యయనానికి ఉపయోగపడనుంది. సదాశయ ఫౌండేషన్‌ చొరవతో ఎల్వీ ప్రసాద్‌ నేత్రబ్యాంకు బృందం నేత్రాలను సేకరించింది. జీజీహెచ్‌ ఆర్‌ఎంవోల సహకారంతో పార్థివదేహాన్ని సిమ్స్‌కు అప్పగించారు. భూదేవి మెడికో విద్యార్థులకు తొలి గురువుగా మారారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దయాళ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆమె చివరి కోరిక నెరవేర్చడం సంతృప్తినిచ్చిందని ఆశ్రమ డైరెక్టర్లు తెలిపారు. అనాథగా జీవించిన భూదేవి మరణానంతరం నలుగురికి మేలు చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్లు గంట సత్తయ్య, లక్కడి మాధవరెడ్డి, బట్టల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమ నిర్వాహకుల చొరవను సదాశయ ఫౌండేషన్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు అభినందించారు.

వృద్ధురాలు భూదేవి అమర సందేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement