శ్రీనిత్యకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

శ్రీనిత్యకు అభినందనలు

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

కరీంనగర్‌సిటీ: విద్యార్థులు జాతీయస్థాయి వేదికలపై ప్రతిభను చాటుకుంటూ దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు, యువత బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్‌ ఆశ్విని తానాజీ వాకడే సూచించారు. ఎస్సారార్‌ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రీనిత్య మాజీ ఉపప్రధాని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ 151వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే శ్రీనిత్యను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణ, జిల్లా యువజన అధికారి ఎం.తిరుపతి, అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ కె.సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement