రామడుగు(చొప్పదండి): రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులను పరిశీలించి, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రామడుగు మండలం దేశరాజ్‌పల్లి, మోతె గ్రామాల్లో ఎండిన వరిపంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోవడం జరిగిందని, కేంద్రం కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరా రు. వరదకాలువ ద్వారా సాగునీరు అందిస్తామని 35 ఏళ్లుగా చెబుతున్నప్పటికీ, నేటికీ నీరు అందడం లేదన్నారు. రైతుల కష్టాలపై ఈ నెల 10న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామన్నా రు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యుడు కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని ఆశోక్, గూ డెం లక్ష్మీ, లక్ష్మారెడ్డి, సురేందర్‌రెడ్డి ఉన్నారు.
మార్కెట్ స్థలం ఆక్రమణలపై అధికారులు మౌనం వీడాలి
కరీంనగర్ టౌన్: జిల్లాకేంద్రంలోని ప్రధాన మార్కెట్ స్థలంలో ఆక్రమణలు, నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ప్రశ్నించారు. మంగళవారం నగరంలో మాట్లాడుతూ మార్కెట్ భూమి విషయంలో గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు మున్సిపాలిటీ కి అనుకూలంగా వచ్చినప్పటికీ ఆక్రమణలపై చర్యలు లేకపోవడం అనుమానాలకు తావి స్తోందన్నారు. కొంత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు అందినా పట్టణ ప్రణాళిక విభాగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ పాలకవర్గానికి, మేయర్‌కు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే వెంటనే ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు సోహాన్‌సింగ్, మైఖేల్ శ్రీనివాస్, ముంజ రవీందర్, డి.అనూప్, భాస్కర్‌రావు, మోహన్‌రావు పాల్గొన్నారు.
ప్రజారోగ్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
కొత్తపల్లి(కరీంనగర్): ప్రజారోగ్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ రాజగోపాల్‌రావు సూచించారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. పలు రికార్డులు పరి శీలించి, ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవలను ఆరా తీశారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ గ్రామస్థాయిలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పంచాయతీ కార్యదర్శులు కలిసి ప్రతి వారం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సిబ్బంది సెలవులు తీసుకోవా ల్సి వస్తే ముందస్తుగా అనుమతి పొందాలని స్పష్టం చేశారు. డాక్టర్ మౌనిక, ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.8,770
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.8,770 పలికింది. మంగళవారం మార్కెట్‌కు 222 వాహనాల్లో 1,802 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.8,650, కనిష్ట ధర రూ.8,300 కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న, ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.


