ధాన్యం కొనుగోళ్లలో కమిటీలే కీలకం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో కమిటీలే కీలకం

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

పర్యవేక్షణ బృందాలతో నిత్యం తనిఖీ

సన్నరకాల గుర్తింపునకు మైక్రోమీటర్లు

కరీంనగర్‌ అర్బన్‌:

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం నిఘాను తీవ్రతరం చేసింది. సన్నాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఆయా కేంద్రాల్లో కొనుగోళ్ల పరంగా ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా మండలస్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్సై, ఏఈవోలు, ఐకేపీ ఏపీఎంలు, పీఏసీఎస్‌ అసిస్టెంట్‌ రిజిస్టార్‌, సీఈవో, మెప్మా అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీలకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు.

సన్నాల గుర్తింపు ఇలా

సన్న ధాన్యంపై అనుమానం ఉంటే కేంద్రానికి కేటాయించిన మైక్రోమీటర్‌ ద్వారా రైతు, ఏఈ వో, కేంద్ర నిర్వాహకుల సమక్షంలో ధాన్యం గింజను కొలుస్తారు. వడ్లను మిల్లులకు తరలించే క్రమంలోనూ గన్నీ సంచులపై సన్నరకం అయితే ‘ఎస్‌’, దొడ్డు రకం అయితే ‘డీ’ అని గుర్తులు పెడతారు. ధాన్యం పొట్టు తీసి పొ డవు, వెడల్పు నిష్పత్తి లెక్కిస్తే 3 కన్నా తక్కువ ఉంటే దొడ్డురకం, ఎక్కువ ఉంటే సన్నరకం ధాన్యంగా గుర్తిస్తారు.

ధాన్యం నాణ్యతపై అవగాహన

జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్‌, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో 318 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సారి అదనంగా టార్పాలిన్లు, సన్నరకం ధాన్యాన్ని కొలిచే మైక్రోమీటర్‌ కేటాయించారు. అవసరం ఉన్న చోట కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు జిల్లాస్థాయి అధికా రులకు తెలిపి మరికొన్ని కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు జమ చేసేలా కసరత్తు చేస్తున్నారు.

సన్నాల లెక్కలు సరియేనా?

సన్నరకం సాగు విస్తీర్ణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటల వివరాల నమోదు పక్కాగా జరగలేదని తెలుస్తోంది. ఏఈవోలు క్షేత్రస్థాయిలో వరి పంటను చూసి ఏది సన్నరకమో, దొడ్డు రకమో గుర్తించలేని పరిస్థితి. పంట దిగుబడి కొనుగోలు కేంద్రాలకు వస్తేనే స్పష్టత వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement