జలసిరితో ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి
మోడల్‌స్కూల్, కేజీబీవీల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలి
కలెక్టర్ చిత్రామిశ్రా
కొత్తపల్లి(కొత్తపల్లి): ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంటకుంట నిర్మించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చని కలెక్టర్ చిత్రా మిశ్రా అభిప్రాయపడ్డారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో వీబీ జీ రాంజీ కార్యక్రమం ద్వారా నిర్మించిన ఇంకుడు గుంతలు, నాగుల మ ల్యాల గ్రామంలో రైతు ఎడ్ల లత పొలం వద్ద నిర్మించిన పంటకుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలసిరిని ప్రారంభించిందన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం కింద ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలా ల్లో పంట కుంటలు, ప్రభుత్వ భూముల్లో కమ్యూనిటీ వ్యవసాయ ఇంకుడు గుంతల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఆసిఫ్‌నగర్‌లోని పీహెచ్‌సీని సందర్శించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎలగందుల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యా ప్రమాణాలు, విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయాలను పరి శీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి, భూ కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచులు తాండ్ర శ్రీనివాస్, అంజయ్య, చంద్రకళ పాల్గొన్నారు.


