సివిల్‌ సప్లయీస్‌పై విజిలెన్స్‌! | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సప్లయీస్‌పై విజిలెన్స్‌!

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

● ధాన్యం అలాట్‌మెంట్‌, బకాయిలపై ఆరా.. రికార్డుల తనిఖీలు ● నేడూ కొనసాగే అవకాశం?

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలోని డిఫాల్ట్‌ రైస్‌మిల్లర్ల అరెస్టు అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా తాజాగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పౌరసరఫరాల శాఖలో తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్‌లోని జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దాదాపు నాలు గు గంటల పాటు రికార్డులు తనిఖీ చేశారు. విజి లెన్స్‌ డీఎస్పీ వెంకటేశం ఆధ్వర్యంలో రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయింపులు, తనిఖీల తీరు అంశాలను పరిశీలించారు. ఇటీవల జమ్మికుంట, హుజూరాబా ద్‌కు చెందిన నలుగురు రైస్‌మిల్లర్లను అరెస్టు చేయగా సీఐడీ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఽమిల్లులకు ధాన్యం కేటాయింపులు చేసిన తీరు, సీఎంఆర్‌ ఎంత మేరకు రాబట్టారు, గతంలో డిఫాల్ట్‌ అయిన మిల్లరుకు ఏమైనా ధాన్యం కేటాయింపులు చేశారా వంటి అంశాలను ఆరా తీశారు. పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో డిఫాల్ట్‌ మిల్లర్ల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. పీడీఎస్‌ బియ్యం, గ్రేడ్‌–ఏ సన్నధాన్యం నిర్వహణ, బకాయిలున్న మిల్లర్లపై పర్యవేక్షణ, నెలవారీ క్షేత్రస్థాయి తనిఖీలు సరిగా నిర్వహించారా, తనిఖీలు చేస్తే ఏమేం చర్యలు తీసుకున్నారనే కోణంలో వివరాలు సేకరించారని సమాచారం. పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలు స్తోంది. ఇటీవల రైస్‌మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, బకాయిలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఏఏ మిల్లుకు ఎలా ధాన్యం రవాణా చేశారో స్పష్టంగా అందులో పేర్కొన్నట్లు సమాచారం. సాధారణ తనిఖీల్లో భాగంగానే విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టిందని, ప్రతీ ఏడాది చేస్తుందని పౌరసరఫరాలశాఖ అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement