బీఆర్‌ఎస్ పాలకవర్గం ఉన్న సమయంలో కొంతమంది కార్పొరేటర్లు భవన నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, భూదందాలకు పాల్పడిన ఉదంతాలను గుర్తు చేస్తూ, బీజేపీ కార్పొరేటర్లు ఆ దందాలకు పాల్పడవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ మా కార్పొరేటర్లను హెచ్చరించారు. అవినీతి మరక అంటితే భవిష్యత్ ఉండదని ముందు జాగ్రత్తలు చెప్పారు. దీనికి బీఆర్‌ఎస్ నాయకులు విపరీత అర్థాలు తీస్తున్నారు.
– కొలగాని శ్రీనివాస్, మేయర్, నగరపాలకసంస్థ
బీజేపీ కార్పొరేటర్లు భవన నిర్మాణదారుల నుంచి వసూళ్లు చేయడం, భూదందాలకు పాల్పడడాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ విశ్వసించే మహాశక్తి ఆలయంలోనే ఆధారాలను బయటపెడుతాం. అప్పుడే ఎవరిపై చర్యతీసుకొంటారో, తానే బాధ్యత వహిస్తారో బండి సంజయ్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బీజేపీ కార్పొరేటర్లపై మేం చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం.
– చల్ల హరిశంకర్, నగర అధ్యక్షుడు, బీఆర్‌ఎస్
కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజమే చెప్పారు. కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు సాగిస్తున్న అక్రమ వసూళ్ల దందా సంజయ్ దృష్టికి రావడంతోనే ఆ వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలోనూ కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాల్లో రెండు పార్టీలదీ ఒకే తీరు. అవినీతి లేని పాలనను అందించాలని కేంద్ర మంత్రికి చిత్తశుద్ధి ఉంటే అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
– వైద్యుల అంజన్‌కుమార్,
అధ్యక్షుడు, కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ


