ఎన్‌హెచ్‌ 563 సమస్యలపై ఆరా | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ 563 సమస్యలపై ఆరా

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

మానకొండూర్‌: మానకొండూర్‌ మండలంలో నేషనల్‌ హైవే 563తో వివిధ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, హైవేపై ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం అంశాలపై పీడీ భరద్వా జ్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. శ్రీనివాస్‌నగర్‌ గ్రామానికి అవతలి వైపు ఉన్న పంట పొలాలకు వెళ్లేందుకు అండర్‌ పాస్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌ ఎరుకల శ్రీనివాస్‌గౌడ్‌ పీడీ దృష్టికి తీసుకొచ్చారు. ఈదులగట్టేపల్లి, ఖాదర్‌గూడెం, శంషాబాద్‌ గ్రామాల వద్ద హైవేను పీడీ పరిశీలించారు. సర్పంచులు మీస సత్యనా రాయణ, కనవేని అక్షయ శ్రీనివాస్‌, మెరుగు కళావతి సంపత్‌, గ్రామస్తులతో మాట్లాడి సర్వీసు రోడ్డు సమస్యలపై ఆరా తీశారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, లిఫ్ట్‌ బ్రిడ్జి నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు ఫీడర్‌పరిధిలోని ఎలైట్‌ హాస్పిటల్‌, కమాన్‌, విషాల్‌ మార్ట్‌, కిషోర్‌ ఆటోస్టోర్‌, సీపీ ఐ కార్యాలయం, గణేశ్‌నగర్‌ ప్రాంతాలతో పా టు 11 కె.వీ.కాపువాడ ఫీడర్‌ పరిధిలోని మీరా హాస్పిటల్‌, గౌరిశెట్టి కాంప్లెక్స్‌, బొమ్మ వెంకన్న భవనం, అహ్మద్‌పుర, సహజ, జేఎన్‌, కన్యకా పరమేశ్వరీ బాంకెట్‌ హాల్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిపివేస్తున్నట్లు టౌన్‌–1,2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎం.లావణ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement