ఈ ఉత్సవాలను దీపావళి సందర్భంగా ఏటా మా కుటుంబమే ఘనంగా నిర్వహిస్తోంది. వారంపాటు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తాం. మా గ్రామానికి ఇతర జిల్లాల నుంచి వచ్చే గిరిజనులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ సంస్కతి సంప్రదాయాలను కాపాడుతున్నాం.
– భీంరావ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జగన్నాథ్‌పూర్
గుస్సాడీతో సమైక్యత
దండారీ ఉత్సవాలతో గిరిజనుల్లో సమైక్యత గుస్సాడీ ద్వారా పెంపొందుతుంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చినవారు దండారీ సందర్భంగా గుస్సాడీ వేషధారణ ధరిస్తారు. ఇరు గ్రామాల మధ్య సత్సంబంధాలు పెంపొందుతాయి. వివాహ బంధాలకు వేదికగా చేసుకుంటాం
– సిడెం భీం, మాజీ సర్పంచ్, జగన్నాథ్‌పూర్
సంప్రదాయాలను కాపాడుతున్నాం
హైటెక్ యుగంలో కూడా గిరిజనులు దండారీ ఉత్సవాలతో వారం పాటు ఘనంగా జరుపుకుంటున్నాం. తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాపాడు
కుంటూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. మన ఆచార సాంప్రదాయాలే నేటి యువతకు ఆదర్శం.
– పరంచ శంకర్, సర్పంచ్, జగన్నాథ్‌పూర్


