బీఈడీ కళాశాలలో ఫీజుల గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

బీఈడీ కళాశాలలో ఫీజుల గోల్‌మాల్‌

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

కోరుట్ల: పట్టణంలోని ఓ బీఈడీ కళాశాలలో ఫీజు విషయమై విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. విద్యార్థుల కథనం ప్రకారం.. రెండేళ్ల బీఈడీ కోర్సులో మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఫస్టియర్‌ ఫీజు అడ్వాన్స్‌గా చెల్లించి సదరు కళాశాలలో చేరారు. రెండో సంవత్సరం మూడో సెమిస్టర్‌లో ప్రస్తుతం టీచింగ్‌ ప్రాక్టీస్‌ కోసం ఫస్టియర్‌ రికార్డులు అడగగా.. యాజమాన్యం ఫస్టియర్‌ ఫీజు చెల్లించాలని పేర్కొంది. తాము కళాశాలలో చేరినప్పుడే ఫస్టియర్‌ ఫీజు రూ.1.20లక్షలు చెల్లించామని స్పష్టం చేశారు. యాజమాన్యం మాత్రం తమకు ఫీజు ఇప్పటి వరకు ముట్టలేదని, ఫీజు చెల్లిస్తేనే రికా ర్డులు ఇస్తామనడంతో 40 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం ఫలితంగా తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

మేనేజ్‌మెంట్‌ కోటా విద్యార్థుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement