యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన దొడ్ల నర్సమ్మ (90) అనారోగ్యంతో సోమవారం మృతిచెందింది. పుట్టేడు దు:ఖంలో కూడా సమాజ హితం కోసం ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు మందుకు రాగా సదాశయ ఫౌండేషన్ ఆద్వర్యంలో వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు సహకారంతో నర్సమ్మ నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. మృతురాలి నేత్రాలను దానం చేసిన కుమారులు, కోడళ్లు కుమారస్వామి–హైమవతి, శ్రీనివాస్–వినోద, కుమార్తెలు, రామనమ్మ, జానకమ్మ, మనవళ్లు దినేశ్, రవి, మనవరాలు కీర్తనలను ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, సంస్థ ప్రతినిధులు, సభ్యులు అభినందించారు.


