వేములవాడఅర్బన్/చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన గొర్రె సాత్విక(20) వేములవాడ పట్టణంలోని తన మేనమామ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, స్థానికులు తెలిపిన వివరాలు. ఎన్గల్‌కు చెందిన గొర్రె లక్ష్మీరాజం–మంజుల దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు వివాహం కాగా, రెండో కూతురు సాత్విక కరీంనగర్‌లో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తుంది. కరీంనగర్‌లోని ఓ యువకుడితో ప్రేమవ్యవహారం విఫలం కావడంతో సోమవారం మేనమామ ఇంట్లో ఉరివేసుకుంది.
తండ్రి రాక కోసం
తండ్రి లక్ష్మీరాజం జీవన్‌పాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లాడు. చిన్నకూతురు స్వాతిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న తండ్రి హుటాహుటిన స్వగ్రామానికి బయలుదేరాడు. మృతురాలు తల్లి మంజుల ఫిర్యాదుతో వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని వ్యక్తి...
జమ్మికుంట: అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై శివరాత్రి రాజయ్య (57) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన రాజయ్య ఒడ్డెర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం భార్య మృతి చెందింది. మృతుడికి కొడుకు, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ప్రవీణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాజయ్య అంత్యక్రియల నిమిత్తం కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేశ్ రూ. 5,000 అందజేశారు.
చికిత్స పొందుతూ మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సదయ్య (40) చికిత్సపొందుతూ మృతిచెందాడు. గత నెల 16న గ్రామస్టేజీ వద్ద నిలబడి ఉండగా మంథని నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో సదయ్యకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై మధుకర్ తెలిపారు.
బియ్యం పట్టివేత
పెద్దపల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం పట్టుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తెలిపారు. సోమవారం పౌరసరఫరాల అధికారులు పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్‌లో ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే సన్నబియ్యాన్ని ప్యాకేజీ బ్యాగుల్లో నింపుతున్న బజ్జూరి శంకర్, తండ్రి రాములును అధికారులు పట్టుకున్నారు. మొత్తం 6 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు అప్పగించారు. పీడీఎస్ సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న శంకర్‌పై కేసు నమోదు చేశారు. డీటీసీఎస్ పోచయ్య, రాజిరెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


