అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

తిమ్మాపూర్‌: మండలంలోని వచ్చునూర్‌ గ్రామంలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానికుల వివరాల ప్రకకారం గ్రామానికి చెందిన ఉప్పులేటి లచ్చవ్వ(65) ఓ రేకులషెడ్డులో నివసిస్తోంది. ఆదివారం రాత్రి నిద్రపోయిన ఆమె సోమవారం ఉదయం బయటకు రాలేదు. ఇంటి వెనుక ఉండే కొడుకు, కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి మంచంలోని చనిపోయి ఉంది. సీఐ అనిల్‌, ఎస్‌ఐ అరుణ్‌ గ్రామానికి చేరుకుని విచారించారు. పోస్టుమార్టం కోసం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహంపై బంగారం కనిపించకపోవడంతో బంగారం దోచుకుని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిందా ఇంకేమైనా కారణముందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఎల్‌ఎండీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

వీణవంక: మండలంలో కిష్టంపేట గ్రామానికి చెందిన బోయిని రాయమల్లు(55) చెట్టు కొమ్మలు కొడుతూ జారి పడగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 31న మధునయ్య టేకు కొమ్మలు కొట్టేందుకు కూలీ పనికి వెళ్లాడు. కొమ్మలు కొడుతూ కాలుజారి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఈ నెల 1న మృతి చెందాడు. మృతుడి కొడుకు కుమార్‌ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఒకరు..

గన్నేరువరం: చేపలవేటకు వెళ్లి ఒకరు మృతి చెందారు. గన్నేరువరం చెందిన రంగనవేని మల్లయ్య (65)సోమవారం ఊరచెరువు కింద ఉన్న ఒర్రె ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చేపలు పట్టే ఒర్రె ప్రాంతంలోకి వెళ్లి గాలించగా నీటిలో మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement