● నిందితుడి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

● నిందితుడి రిమాండ్‌

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

● నిందితుడి రిమాండ్‌

ఉపసర్పంచ్‌కు కత్తిపోట్లు

ఎల్లారెడ్డిపేట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి ఉపసర్పంచ్‌ బొడ్డు రాజుపై కత్తిపోట్లు కలకలం రేపాయి. నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ ఓదెల వెంకటేశ్‌ తెలిపిన వివరాలు. బండలింగంపల్లి ఉపసర్పంచ్‌ బొడ్డు రాజు టెంట్‌హౌస్‌ నిర్వహిస్తున్నాడు. టెంట్‌హౌస్‌లో పనిచేసే అదే గ్రామానికి చెందిన బొడ్డు నరేశ్‌, జక్కుల మహేశ్‌లతో కలిసి రాజు ఆదివారం అర్ధరాత్రి ఆటోలో వస్తుండగా డీజిల్‌ అయిపోవడంతో అదే గ్రామంలోని కాసరవేణి ఎల్లం ఇంటికి వెళ్లారు. అక్కడే నిల్చున్న వ్యక్తి అకారణంగా వీరితో గొడవకు దిగాడు. ఈక్రమంలోనే ఇంట్లో నుంచి మరో వ్యక్తి అజ్మీర శ్రీను కూరగాయల కత్తితో పరుగెత్తుకుంటూ వచ్చి రాజును పొడిచాడు. తీవ్రరక్తస్రావమైన రాజును వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అజ్మీర శ్రీను స్వస్థలం మెదక్‌ జిల్లా శంకరంపేట మండలం మీర్జంపల్లి. బండలింగంపల్లిలో పెయింటింగ్‌ పని చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో అజ్మీర శ్రీనును అరెస్ట్‌ చేశారు. పేయింటర్‌ దాడిలో గాయపడ్డ రాజును బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి తదితరులు పరామర్శించారు.

పేకాట స్థావరంపై దాడి

కరీంనగర్‌ క్రైం: పేకాట ఆడుతున్న ఆరుగురిని కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. రామచంద్రాపూర్‌ కాలనీలోని ఓ ఇంటి మొదటి అంతస్తులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం దాడి చేశారు. ఆరుగురిని పట్టుకుని, రూ.32,340నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ కె.రాంచందర్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement