కోల్‌సిటీ: గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు ఓ తల్లికి పోషకాహార లోటు లేకుండా అండగా నిలిచింది గోదావరిఖనికి చెందిన నీడ స్వచ్ఛంద సేవా సంస్థ. సంస్థ దత్తత తీసుకున్న స్థానిక ఇంది రానగర్‌కు చెందిన నిరుపేద గర్భిణి జమున పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గర్భధారణ సమయం నుంచి తొమ్మిది నెలలపాటు పౌష్టికాహారం, పండ్లు, తృణధాన్యాలను సంస్థ అందించింది. ఈ సేవ కు దేవులపల్లి సురేశ్–శ్వేత దంపతులు మొదటి దాతలుగా, యూనియన్ బ్యాంకు ఉద్యోగి షేక్ కరీముల్లా రెండో దాతగా ఆర్థికసాయం అందించారు. సోమవారం చిన్నారి జన్మించిన 21వ రోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నీడ ప్రాజెక్టు ఇన్‌చార్జి, యూనియన్ బ్యాంకు ఉద్యోగి ఎస్.కరుణ్‌కుమార్ చిన్నారికి దుస్తులు, తల్లికి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా జమున, ఆమె తల్లి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రతినిధి సాయి పాల్గొన్నారు.
నితిన్ నబీన్ పర్యటన వాయిదా
కరీంనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. దీపావళి ముగిసిన వెంటనే కరీంనగర్‌లో పర్యటిస్తానని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నిర్వహించతలపెట్టిన ‘మహా పాదయాత్ర’కు స్వయంగా హాజరవుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం స్పందిస్తూ, పార్టీ శ్రేణులందరూ రాబోయే మహా పాదయాత్ర కోసం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. దీపావళి తర్వాత జరగబోయే ఈ మహా పాదయాత్రతో జిల్లాలో పార్టీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.


