రామగుండం: హైదరాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ – బీదర్(17011/12) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈ నెల 3వ తేదీ నుంచి లింక్ హాఫ్ మ్యాన్ బుస్క్(ఎల్‌హెచ్‌బీ– 14 బోగీలతో) రాకపోకలు సాగించనున్నట్లు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఐసీఎఫ్ 16 బోగీలతో నడిచిన ఈ రైలుకు ప్రత్యేక రేక్ కేటాయించడంతో నిర్దేశిత సమయానికి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ప్రమాదంలో పక్కకు జరిగినా, ఒకదానికొకటి ఢీకొట్టినా, బోగీలు ఒకదాని పైకి ఒకటి ఎక్కవు. ప్రాణనష్టం తగ్గుతుంది. ఈ బోగీలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసినవి. ప్రమాద సమయంలో ఒత్తిడిని తట్టుకునే స్వభావం ఉంటుంది. త్వరగా తుప్పు పట్టే అవకాశాలు తక్కువ. గంటకు 160 కి.మీ. –200 కి.మీ. వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. అధునాతన షాక్ అబ్జార్బర్స్ ఉండడంతో రైలు వేగంగా వెళుతున్నా కుదుపులు తెలియవు. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో శక్తివంతమైన డిస్క్‌బ్రేక్ సిస్టమ్ ఉండడంతో వేగాన్ని త్వరగా అదుపులోకి తీసుకురావచ్చు. పొడవుగా అధికంగా ఉండడవంతో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చుయ. పాత బోగీల్లో 64 సీట్లు ఉంటే ఎల్‌హెచ్‌బీలో 72 సీట్లు ఉంటాయి. అధునాతన బయో–టాయిలెట్ వ్యవస్థ ఉంటుంది. తక్కువ బరువు ఉండడంతో ఇంధనం ఆదా అవుతుంది.
రేపటి నుంచి హైదరాబాద్– సికింద్రాబాద్ – బీదర్ మధ్య రాకపోకలు


